Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేతనాలు పెంచాలని కోరుతూ ఉపాధ్యాయులు, ట్రైన్ డైవర్ల ఆందోళనలు
లండన్ : ఈ దశాబ్దంలోనే అతిపెద్ద వాకౌట్, సమ్మెలతో బ్రిటన్ అట్టుడుకుతోంది. విద్య, రవాణా, పౌర సేవలకు చెందిన 5 లక్షల మంది వర్కర్లు బుధవారం తమ పని ప్రదేశాల్లో వాకౌట్ చేశారు. 2011 నవంబరు30న జరిగిన పెన్సనర్ల సమ్మె తరువాత తిరిగి అంత పెద్దయె త్తున సమ్మె జరగడం ఇదే మొదటి సారి. అధిక ధరలకు వ్యతిరేకంగా రైలు డ్రైవర్లు, ఉపాధ్యాయులు, విశ్వ విద్యాలయ సిబ్బంది, సివిల్ సర్వెంట్ల సంయుక్తంగా సమ్మె చేస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగు ణంగా వేతనాలు పెంచా లని వీరం తా నిరసనలకు దిగడంతో పాఠశాలలు మూతపడటంత పాటు, బ్రిటన్ రైల్ నెట్వర్క్ నిర్వీర్య మయింది. బుధ వారం లండన్లో ఉపాధ్యాయులు మార్చ్ నిర్వహించారు. సుమారు 4,75,000 మంది యూనియన్ సభ్యులు సమ్మెలో పాల్గొన్నారు. విక్టోరియా, కానన్ స్ట్రీట్, మెరిలేబోస్, లండన్ బ్రిడ్జ్ స్టేషన్లతో సహా లండన్లో ప్రధాన రైలు స్టేషన్లనీ పూర్తిగా మూసివేయబడ్డాయి. ఇంగ్లండ్, వేల్స్ల్లో 85 శాతం పాఠశాలలు మూసివేయబడినట్లు నేషనల్ ఎడ్యుకేషన్ యూనియన్ వెల్లడించింది. కాగా, ఈ సిబ్బందికి తోడుగా ఈ నెల 17 నుంచి నాలుగు రోజుల పాటు సమ్మె చేస్తామని సరిహద్దు దళ అధికారులు తెలిపారు.