Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదానీ సంస్థను కోరిన బంగ్లాదేశ్
ఢాకా : అదానీతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని బంగ్లాదేశ్ విద్యుత్ సంస్థ పున:పరిశీలించాలని కోరింది. ఈ మేరకు జార్ఖండ్‌లోని అదానీ పవర్‌ప్లాంట్‌కు బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డ్ (బిపిడిబి) లేఖ రాసింది. అదానీ పవర్ లిమిటెడ్ నుండి విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై 2017లో బంగ్లాదేశ్ సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు కోసం కొనుగోలు చేయాల్సిన బొగ్గు ధరను అదానీ పవర్‌ప్లాంట్ అధికంగా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. జార్ఖండ్‌లోని 1600 మెగా వాట్ల ప్లాంట్‌కు ఇంధనంగా వినియోగించే బొగ్గును దిగుమతి చేసేందుకు ఎల్సిలను ప్రారంభించడానికి సంబంధించి వచ్చిన అభ్యర్థనల మేరకు తాము అదానీ సంస్థకు లేఖ రాశామని బిపిడిబికి చెందిన ఓ అధికారి తెలిపారు.
ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్ బంగ్లాదేశ్‌కు ఎగుమతి అవుతుందని, దీంతో బొగ్గు రవాణా సహా కొనుగోలుకయ్యే ఖర్చులన్నీ బంగ్లాదేశ్ భరించాల్సి వుంది. ఈ బొగ్గు ధరను విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో చేర్చాల్సి వుంది. స్థానిక మీడియా ప్రకారం.. బొగ్గు దిగుమతి కి సంబంధించి ఎల్సిలను ప్రారంభించే ముందు భారత అధికారుల కు అదానీ పవర్ డిమాండ్ నోట్‌ను సమర్పించాల్సివుంది. దీంతో డిమాండ్ నోట్‌ను ఇవ్వాల్సిందిగా బిపిడిబిని కోరినట్లు తెలిపింది. అయితే డిమాండ్ నోట్ బొగ్గు ధరను మెట్రిక్ టన్ను 400 డాలర్లుగా పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రస్తుత పరిస్థితులను అనుసరించి ఇది చాలా ఎక్కువని బంగ్లాదేశ్ అధికారులు వాదిస్తున్నారు. ఇతర ప్లాంట్లకు మెట్రిక్ టన్ను బొగ్గుకు 250 డాలర్లు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.