Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: భారత్‌తో బ్రిటన్ సంబంధాలపై ఆ దేశ ప్రధాని రిషి సునాక్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. వాణిజ్యం, రక్షణ వంటి రంగాల్లో ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత వృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని లండన్‌లో భారత హైకమిషన్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ప్రకారం.. ఇటీవల అమెరికా పర్యటనలో పాల్గొన్న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్వదేశానికి తిరిగివస్తూ లండన్ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ జాతీయ భద్రత సలహాదారు టిమ్ బారోతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రిషి సునాక్ కొద్ది సేపు పాల్గొన్నారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల వృద్ధికి తమ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని అజిత్ దోవల్‌కు హామీ ఇచ్చారు.