Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్ : ఇప్పటికే సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్ ఉగ్రవాద దాడులతో తల్లడిల్లుతోంది. ఆదివారం బలూచిస్థాన్‌లోని క్వెట్టా నగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతగల ప్రాంతంలో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో అనేకమంది గాయపడినట్లు పాకిస్థాన్ మీడియా తెలిపింది.
వీరిలో ఐదుగురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. క్వెట్టా పోలీస్ ప్రధాన కార్యాలయం సమీపంలోని క్వెట్టా కంటోన్మెంట్ ప్రవేశం (ఎఫ్‌సీ మూసా చెక్‌పాయింట్) వద్ద ఆదివారం ఉదయం భారీ బాంబు పేలుడు సంభవించిందని పాక్ మీడియా తెలిపింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను బలూచిస్థాన్ పోస్ట్ ట్వీట్ చేసింది.
పేలుడు జరిగిన వెంటనే పెద్ద ఎత్తున పొగ, ధూళి వ్యాపించినట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయ కార్యకలాపాలు ప్రారంభించారు. సహాయ కార్యకలాపాల్లో పాల్గొంటున్న జీషన్ అహ్మద్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ, క్షతగాత్రులను క్వెట్టాలోని సివిల్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. పోలీసులు, అత్యవసర సమయాల్లో సేవలందించే బృందాలు చేరుకున్నాయని, సంఘటన స్థలాన్ని స్వాధీనంలోకి తీసుకున్నాయని చెప్పారు.