Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దోరల్ (అమెరికా): లాటిన్ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్‌కు ఒకప్పటి అధ్యక్షుడు జేర్ బోల్సనారో ప్రస్తుతం అమెరికాలో ఒక చిన్న ఫ్లోరిడా పట్టణంలో అసాధారణ శరణార్థిగా జీవిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లో ఒంటరిగా తింటూ కాలం వెళ్ళదీస్తున్నారు. గత డిసెంబరులో ఇక్కడకు చేరుకున్న బోల్సనారో ఇక్కడనుండే బ్రెజిల్లో లూలా డసిల్వా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నారు. దేశంలో అశాంతి రేపేందుకు ప్రయత్నించారన్న అభియోగాలపై బ్రెజిల్లో ప్రస్తుతం ఆయనపై దర్యాప్తు జరుగుతోంది. కాగా ఆయన ఈ ఆరోపణలను తిరస్కరిస్తున్నారు. విలాసవంతంగా వుండే అధ్యక్ష భవనంలో వున్న బోల్సనారో ఇప్పుడు డిస్నీ వరల్డ్ రిసార్ట్ సమీపంలో ఒక చిన్న కమ్యూనిటీలో జీవిస్తున్నారు. అమెరికాలో మొదటి ఆరువారాలు బయటి ప్రపంచానికి పెద్దగా తెలియకుండా బతికిన బోల్సనారో శుక్రవారం ఒక కార్యక్రమంలో దాదాపు 400మంది మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. మియామీకి సమీపంలో దోరల్ నగరంలోని ట్రంప్ నేషనల్ హోటల్లో ఈ కార్యక్రమం జరిగింది.