Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్: తమ గగనతలంలో ఎగురుతున్న చైనా నిఘా బెలూన్ను ఆదివారం కూల్చివేసిన నేపథ్యంలో వాటి శకలాలను అమెరికా అధికారులు సేకరించడం ప్రారంభించారు. అమెరికన్ మిలటరీ వీటిని సేకరించి, విశ్లేషించడం ప్రారంభించిందని అధికారులు తెలిపారు. గతంలో కూడా చైనా బెలూన్లు అమెరికా గగనతలాన్లి ఉల్లంఘించిన ఘటనలు వున్నాయని అమెరికా నార్తరన్ కమాండ్‌కి చెందిన ఎయిర్‌ఫోర్స్ జనరల్ గ్లెన్ డి వాన్ హెర్కె చెప్పారు. కాగా చైనా ప్రభుత్వం ఈ చర్యను 'అతిగా స్పందించడం'గా విమర్శించిన సంగతి విదితమే. కాగా, బెలూన్ శిథిలాలేవీ బీజింగ్‌కి ఇచ్చే ఆలోచన అమెరికాకు లేదని వైట్‌హౌస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు.