Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లిమా: గత కొన్ని రోజుల్లోనే బర్డ్‌ఫ్లూ వైరస్ వల్ల వేలాది పక్షులు మృతి చెందాయని ఫిలిప్పీన్స్ మీడియా వర్గాలు తెలిపాయి. ఎనిమిది రక్షిత తీర ప్రాంతాల్లో 55 వేల పక్షులు, 585 సీ లైన్స్ (నాలుగు కాళ్లతో ఉండే సముద్రపు చేపలు... లేదా పిన్నిపెడ్లు) మృతి చెందాయని సహజ ప్రాంతాల రక్షణ సంస్థ సెర్నాప్ అనే ఏజెన్సీ తాజాగా వెల్లడించింది. చనిపోయిన పక్షుల్లో పెలికాన్లు, వివిధరకాల గల్ పక్షులు, పెంగ్విన్లు ఉన్నాయని సెర్నాప్ ఏజెన్సీ ఓ ప్రకటనలో వెల్లడించింది. హెచ్5ఎన్1 అనే వైరస్ చనిపోయిన పక్షుల్లో ఉందని దీనివల్లే అవి మృతి చెందాయని లేబొరేటరీ పరీక్షల్లో తేలింది. దీంతో అధికారులు బయోలాజికల్ విజిలెన్స్ ప్రోటోకాల్‌ను ప్రకటించారు. ఇక పెరూ నేషనల్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్ (ఎస్ఈఆర్ఎఫ్ఓఆర్) బీచ్‌కి పెంపుడు జంతువుల్ని తీసుకెళ్లొద్దని, అలాగే ప్రజల్ని కూడా బీచ్‌లకు వెళ్లొద్దని కోరింది. బొలీవియా, కొలంబియా, కోస్టారికా, ఈక్వెడార్, హౌండురాస్, పనామా, పెరూ, వెనిజులాల్లో బర్డ్‌ప్లూ వ్యాప్తి చెందే అవకాశముందని వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ (డబ్యూఓఏహెచ్) గతవారం వెల్లడించింది. దక్షిణ అమెరికాలోని పక్షుల్లో కనుగొన్న ఏవియన్ ఫ్లూ వ్యాప్తి మరికొన్ని దేశాలకు వ్యాప్తి చెందే అవకాశముందని డబ్ల్యుఓఓహెచ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక 2021 సంవత్సరం చివరలో యూరప్‌లో కూడా హెచ్5ఎన్1 వైరస్ వ్యాపిచింది. అలాగే ఉత్తర, దక్షిణ అమెరికాల్లో ఉన్న పక్షుల్లో కూడా ఈ బర్డ్‌ఫ్లూ వైరస్ సోకింది. ఈ వ్యాధి ఉత్తర అమెరికా నుంచి వలస వచ్చే పక్షుల ద్వారా వ్యాపిస్తుందని గతంలో సెనాసా అనే వ్యవసాయ ఆరోగ్య సంస్థ తెలిపింది.