Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాగునీరు, పారిశుద్ధ్య వసతుల్లేక పిల్లలకు ఇక్కట్లు
- వారి అభ్యాసనా సామర్థ్యాల్ని దెబ్బతీస్తాయి : యునెస్కో నివేదిక
న్యూయార్క్: మంచినీరు, మరుగుదొడ్డి, మురిగినీరు పోయే నాలా లేని పాఠశాలలు ప్రపంచంలో అనేకమున్నాయని ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక సంస్థ 'యునెస్కో' ఆందోళన వ్యక్తం చేసింది. కనీస వసతుల మెరుగుదల కోసం ప్రభుత్వాలు, ఇతర సంస్థలు నిధుల వ్యయంపై దృష్టి సారించాలని పేర్కొంది. మెరుగైన వసతులు పిల్లల అభ్యాసనా సామర్థ్యాల్ని పెంచుతాయని నివేదిక రూపకల్పనలో పాలుపంచుకున్న హెల్త్, నూట్రీషియన్ నిపుణురాలు ఎమిలీ సిడానెర్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పాఠశాలల్లో నెలకొన్న వసతులపై యునెస్కో అధ్యయనం చేపట్టగా, సగం స్కూల్స్‌లో కనీస వసతుల్లేవని తేలింది. శుద్ధమైన తాగునీరు, చేయి కడుక్కొనేందుకు సబ్బు లేక పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పరిశోధకులు గుర్తించారు. ఒక మరుగుదొడ్డి, మురికినీరు పోయే నాలా ఉన్న పాఠశాలను 'కనీస పారిశుద్ధ్య వసతులు'న్న పాఠశాలగా పరిశోధకులు వర్గీకరించారు. ఈ లెక్కన కనీస వసతుల్లేని పాఠశాలలు ప్రపంచంలో మూడింట ఒకవంతు ఉన్నాయని నివేదిక తెలిపింది. మరికొన్ని వివరాలు ఈ విధంగా ఉన్నాయి. స్కూల్స్‌కు వెళ్తున్న ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరు తాగునీటి సమస్యకు గురవుతున్నారు. ఇది వారి ఆరోగ్యాన్ని, పాఠశాలల్లో అభ్యాసనా సామర్థ్యాల్ని దెబ్బతీస్తోంది. 'పిరియడ్స్' సమయంలో స్కూల్లో నీరు, సబ్బులేకపోవటం బాలికలకు ఇబ్బంది కలిగిస్తోంది. ఉదాహరణకు భూటాన్‌లో ప్రతి నలుగురులో ఒక బాలిక పాఠశాలకు గైర్హాజరవుతోంది.
పిల్లల ఆరోగ్యంపై ప్రభావం : ఎమిలీ సిడానెర్
మూడింట ఒక వంతు పాఠశాలల్లో పిల్లలకు తాగునీరు అందుబాటులో లేదు. కనీసం ఒక మరు గుదొడ్డి లేదు. చేయి కడుక్కొనేందుకు నీరు, సబ్బు లేని పాఠశాలలు సగమున్నాయి. కోవిడ్-19 వైరస్, దోమ కాటు, డయేరియా.. మొదలైన వ్యాధులు సోక కుండా ఉండాలంటే పాఠశాలల్లో కనీస వసతులు అత్యంత ముఖ్యమైనవని నిపుణు రాలు ఎమిలీ సిడానెర్ అభిప్రాయపడ్డారు. కనీస వసతులలేమి పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని హెచ్చరించారు. శుద్ధమైన తాగు నీరు పిల్లలకు ఇవ్వలేకపోతే, పాఠశాల ఆవరణలో పిల్లలు భోజనం చేయరాదని, దీనివల్ల పిల్లల్లో పోషకాహార లోపం తలెత్తుతుందని సిడానెర్ తెలిపారు.