Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 101 గంటల తర్వాత బయటకు
అంకారా : టర్కీ, సిరియాల్లో భీకరమైన భూ కంపం సంభవించిన నాలుగు రోజులు గడిచింది. అప్పటి నుండి శిధిలాల కింద చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు సహాయక సిబ్బంది అహర్నిశలు శ్రమిస్తూనే వున్నారు. తాజాగా 101 గంటల పాటు శిధిలాల్లో చిక్కుకుపోయిన ఆరుగురు సభ్యులున్న కుటుంబం మృత్యువును ఎదిరించి మరీ సజీంగా బయటపడ్డారు. కుప్పకూలిన భవన శిధిలాల్లోనే ఒక చిన్న ప్రాంతంలో కలిసికట్టుగా వుండి ప్రాణాలు నిలుపుకున్న ఆరుగురు వ్యక్తులను విజయవంతంగా వెలికితీసినట్లు సహాయక కార్యకర్త మురత్ బైగల్ మీడియాకు తెలిపారు. అయితే, దిగజారుతున్న ఉష్ణోగ్రతల కారణంగా శిధిలాల్లో చిక్కుకుపోయినవారు జీవించే అవకాశాలు తగ్గుతాయని సహాయక సిబ్బంది పేర్కొంటున్నారు.
22 వేలు దాటిన మృతులు
టర్కీ, సిరియాల్లో భూకంప మృతుల సంఖ్య 22 వేలు దాటింది. టర్కీలో మృతుల సంఖ్య 18,991కి పెరిగిందని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ప్రకటించారు. సిరియాలో ప్రతిపక్షాల అదుపులో వున్న ప్రాంతాల్లో మృతుల సంఖ్య 2,037కి చేరగా, ప్రభుత్వ నియంత్రణలోని ప్రాంతాల్లో మరణించిన వారి సంఖ్య 1340గా వుందని ఆ దేశ రక్షణ వర్గాలు తెలిపాయి.
ఆపరేషన్ దోస్త్..
టర్కీ, సిరియాలకు ప్రపంచ దేశాలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) ఆర్థిక సాయం ప్రకటించాయి. భారత్ 'ఆపరేషన్ దోస్త్' ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ కింద భారీగా రెస్క్యూ, వైద్య బృందాలతో పాటు ఇతర సామగ్రిని పంపింది. భారత సైన్యం హతేయిలో అత్యవసర వార్డుని ఏర్పాటు చేసింది. అమెరికా 85 మిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. టర్కీ, సిరియాలకు సిరియాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) అండగా నిలిచింది. డబ్ల్యుహెచ్ఒ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ సిరియాలో పర్యటించనున్నారు.