Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాడ్రిడ్ : అంటార్కిటికాలో మంచు తగ్గిపోతోంది. జనవరి నెలలో మంచుతో కప్పివున్న ప్రాంతం అంటార్కిటికాలో గతంలో కంటే అత్యంత తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూతాపమే దీనికి ప్రధానకారణమని పునరుద్ఘాటించారు. ఐరోపాలో ఈ ఏడాది జనవరి నెలలో నమోదైన ఉష్ణోగ్రతలు అత్యంత ఎక్కువని, మూడో గరిష్ట ఉష్ణతాప జనవరిగా రికార్డుకెక్కిందని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ప్రత్యేకించిన నూతన సంవత్సరం తొలి రోజైన జనవరి 1న ఐరోపా ఖండంలోని అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు యూరోపియన్ యూనియన్ కోపర్నికస్ వాతావరణ విశ్లేషణా సంస్థ (సి3ఎస్) పేర్కొంది. అయితే అంటార్కిటికాలో మంచు కరిగిపోవడం కారణంగా సముద్ర జలాల మట్టాల్లో ప్రభావం చూపదని, ఎందుకంటే అప్పటికే మంచు రూపంలో సముద్ర జలాల్లో భాగంగానే ఉన్నందన పరిమాణంలో తేడా వుండదని తెలిపింది. కానీ మంచు కరిగిపోవడం వల్ల దాని ప్రభావం కారణంగా ప్రపంచ ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవచ్చునని ఆందోళన వ్యక్తం చేసింది. మంచు కరగకుండా ఉంటే శ్వేత వర్ణ సముద్ర ఉపరితలం 90 శాతం సౌరశక్తిని అంతరిక్షంలోకి తిరిగి పంపేస్తుందని, అయితే మంచు కరిగిపోతే జలాలు సౌరశక్తిని స్వీకరించడం వల్ల ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయని సి3ఎస్ తెలిపింది.