Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంకారా : వరుస భూకంపంతో అతలాకుతలమైన టర్కీ, సిరియాల్లో మతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 21 వేల మంది మరణించగా, వేలాది మంది గాయాలపాలైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. టర్కీలో 17,674 మంది మరణించగా, సిరియాలో 3,377 మంది మరణించారని అన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే దట్టంగా కురుస్తున్న మంచు, తరుచూ వస్తున్న ప్రకంపనలు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి.
గాజియాంటెప్లోని భూకంప కేంద్రం సమీపంలో భారీ విధ్వంసం నెలకొంది. పలు నగరాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. రెండు సెకన్లలోనే బహుళ అంతస్తుల భవనాలు శిథిలాలుగా మారాయని ప్రత్యక్ష సాక్షి పేర్కొన్నారు. మూడు వేలకు పైగా భవనాలు కూలిపోయినట్లు ప్రభుత్వం తెలిపింది. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ పెద్ద సంఖ్యలో మతదేహాలు బయటపడుతున్నాయి. శిథిలాల కింద ఎంతమంది ఉన్నారన్న దానిపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. అయితే, సమయం గడుస్తున్న కొద్దీ వారు సజీవంగా ఉండే అవకాశాలు తగ్గుతున్నాయి. దీంతో మతుల సంఖ్య మరింత పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సహాయక సిబ్బంది విస్తతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి.
టర్కీ, సిరియాలకు ప్రపంచ దేశాలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) ఆర్థిక సాయం ప్రకటించాయి. భారత్ 'ఆపరేషన్ దోస్త్' ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ కింద భారీగా రెస్క్యూ, వైద్య బందాలతో పాటు ఇతర సామగ్రిని పంపింది. భారత సైన్యం హతేయిలో అత్యవసర చికిత్స వార్డుని ఏర్పాటు చేసింది. అమెరికా 85 మిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. టర్కీ, సిరియాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) కూడా అండగా నిలిచింది. డబ్ల్యుహెచ్ఒ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ సిరియాలో పర్యటించనున్నారు.