Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంకారా : టర్కీ, సిరియాల్లో సంభవించిన వరుస భూకంపాలతో వేలాదిమంది మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ భూకంపాల వల్ల 24 వేల మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. టర్కీలో 20,665 మంది మృతి చెందారని విపపత్తు నిర్వహణా అధికారులు శనివారం వెల్లడించారు. ఇక సిరియాలో 3,500 మందికిపైగా మృతి చెందారు. ఇక దక్షిణ టర్కీలోని భూకంప ప్రాంతం నుండి 93 వేల మందిని సహాయక శిబిరాలకు తరలించినట్లు రెస్క్యూ అధికారులు తెలిపారు. ఈ సహాయక చర్యల్లో దాదాపు 16 వేల మందికిపైగా సిబ్బంది పాల్గొన్నారు. ఈ భూకంపం వల్ల రెండు దేశాల్లో 87 వేల మందికిపైగా ప్రజలకు ఆహారాన్ని అందజేయాల్సిన అవసరముందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆర్మేనియా, టర్కీల దేశాల మధ్య సరిహద్దు 30 ఏళ్ల తర్వాత తెరవబడింది. టర్కీలోని ఇగ్దిర్ ప్రావిన్స్‌లోని అలికాన్ సరిహద్దు గుండా ఐదు ట్రక్కుల మనుషులను పంపినట్లు అర్మేనియా అధికార పక్షనేత గారో పైలాన్ ట్వీట్ చేశారు.
122 గంటల తర్వాత సజీవంగా ఇద్దరు మహిళలు
కాగా, సోమవారం నుంచి అవిశ్రాంతంగా రెస్క్యూసిబ్బంది శిధిలాల కింద నుంచి మృతదేహాలను వెలికితీస్తున్నారు. మృతదేహాల నుంచి గాఢమైన వాసన వెదజల్లుతున్నా.. శిథిలాల కింద బతికున్నవారి కోసం రెస్క్యూ సిబ్బంది వెతుకుతున్నారని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఇక శనివారం కొనసాగుతున్న సహాయక చర్యల్లో రెస్క్యూ సిబ్బంది శిథిలాల కింద ఉన్న ఇద్దరు మహిళలను బయటకు తీశారు. దాదాపు 122 గంటల తర్వాత వారిని శిథిలాల నుంచి సజీవంగా బయటకు తీసినట్లు రెస్క్యూ అధికారులు వెల్లడించారు. రెస్క్యూ సిబ్బంది రక్షించబడిన మహిళల్లో మెనెక్సే తబాక్ (70). ఈమె కహ్రామన్మరాస్ ప్రావిన్స్‌కి చెందిన వారు. ఈమెను వెంటనే చికిత్సనిమిత్తం రెస్క్యూసిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఇక రెండో మహిళ మసల్లా సిసెక్ (55). టర్కీలోని దియార్బాకిర్ నగరంలోని అతిపెద్ద భవనం కూలిపోయిన శిథిలాల నుంచి ఈమెను బయటకు తీసినట్లు మీడియా వర్గాలు తెలిపాయి.