Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో బయటకు వస్తారు' : పాళ నెదుమారన్
- ఇది 'జోక్' : శ్రీలంక
కొలంబో: ఎల్టీటీఈ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నారంటూ ఓ తమిళ జాతీయోద్యమ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. 'ప్రభాకరన్ సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నారు. త్వరలో బయటకు వస్తారు' అని తమిళ నేత పాళ నెదుమారన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అయితే శ్రీలంక రక్షణశాఖ దీన్నొక 'జోక్'గా అభివర్ణించింది. 'ప్రభాకరన్ 2009 మే నెలలో హతమైనట్టు నిర్ధారితమైంది. డీఎన్ఏ పరీక్షతోనూ అతని మరణాన్ని ధ్రువీకరించాం' అని శ్రీలంక రక్షణశాఖ ప్రతినిధి కర్నల్ నలిన్ హెరాత్ ఓ వార్తాసంస్థకు తెలిపారు.