Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్తాంబుల్ : గత సోమవారం టర్కీ, సిరియాల్లో సంభవించిన పెను భూకంపంలో మృతుల సంఖ్య ఇప్పటికే 35వేలు దాటిందని అధికారులు, వైద్య బృందాలు తెలిపాయి. ప్రకృతి విపత్తు సంభవించి వారం రోజులు గడిచినందున ఇక శిధిలాల్లో చిక్కిన వారు జీవించి వుండే అవకాశాలు మృగ్యమవుతాయని గాలింపు, సహాయక బృందాలు తెలిపాయి. అందువల్ల తమ కార్యకలాపాలను ముగించాలని భావిస్తున్నాయి. టర్కీలో ఇప్పటివరకు 31,643మంది మరణించగా, సిరియాలో 3,581మంది చనిపోయారు. దీంతో మొత్తంగా మృతుల సంఖ్య 35,224కి చేరింది. భూకంప కేంద్రం భూమిలో 18 కిలోమీటర్ల లోతున వుందని అమెరికా భౌగోళిక సర్వే తెలిపింది. పైగా గాజియన్తాపెకి 33కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం కేంద్రం వుంది. ఈ ప్రాంతంలో పెళుసైన కాంక్రీటుతో కట్టిన భవనాలు ఎక్కువ. దీనివల్ల త్వరగా పగుళ్లు రావడానికి లేదా కూలిపోవడానికి, లేదా ఉక్కు తుప్పు పట్టడానికి అవకాశాలు వుంటాయని అమెరికా భౌగోళిక సర్వే (యుఎస్జిఎస్) తెలిపింది. ఈ కారణంగానే భూకంపంలో నష్టం కూడా ఎక్కువగా వుంది. టర్కీ సహజంగానే భూకంపాలు తరచుగా వచ్చే ప్రాంతం, 2020లో వచ్చిన భూకంపంలో 33వేల మంది చనిపోయారు.