Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజారోగ్య వ్యవస్థ పరిరక్షణ కోసం భారీ ఉద్యమం
- పెడ్రో ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్రదర్శనలు
మాడ్రిడ్ : ప్రజారోగ్య వ్యవస్థను పరిరక్షించుకునేందుకు స్పెయిన్ ప్రజానీకం ఉద్యమబాట పట్టారు. అక్కడి పెడ్రో ప్రభుత్వం అనుసరిస్తున్న వినాశకర చర్యలను నిరసిస్తూ భారీ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. గత ఆదివారం చేపట్టిన భారీ ర్యాలీల్లో పది లక్షల మంది పైగా ప్రజలు పాల్గొన్నారు. వాయువ్య స్పెయిన్‌లోని శాంటియూగో డి కంపెస్టెలాలో నిర్వహించిన ర్యాలీలోనే దాదాపు 20 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. 'ఆరోగ్య హక్కు.. మానవ హక్కు. ఆరోగ్య సేవలను రక్షించండి' అంటూ ప్లకార్డులు పట్టుకుని జాతీయ పతాకాలతో ఆందోళనకారులు నినాదాలను హోరెత్తించారు. 'స్పెయిన్‌లో ప్రజారోగ్య వ్యవస్థ చాలా బాగుండేది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్య వ్యవస్థ క్షీణించింది. ముఖ్యంగా కరోనా మహ్మరి తర్వాత మరీ క్షీణిస్తున్నది' అని ఆందోళనకారులు పేర్కొన్నారు. ర్యాలీలో పాల్గొన్న ఆస్పత్రిలో పనిచేసే నర్సు మైట్ లోపెజ్ మాట్లాడుతూ.. 'పరిస్థితి ఏం బాగోలేదు. మేం రోగులకు సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నాం' అని వాపోయారు. స్పెయిన్ ప్రభుత్వం తలసరి ఖర్చు కన్నా తక్కువ మొత్తాన్ని ఖర్చు చేస్తుందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. మెరుగైన పని పరిస్థితులు, వేతనాలను కోరుతూ మాడ్రిడ్‌లోని అమిట్స్ వైద్యుల సంఘం గత ఏడాది నవంబర్ నుండి సమ్మె చేస్తోంది. ఈ సమ్మెల్లో శిశు సంరక్షణ వైద్యులు కూడా పాల్గొంటున్నారు.