Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కారకస్ : వాణిజ్య ఒప్పందంపై వెనిజులా, కొలంబియా దేశాలు తాజాగా సంతకం చేశాయి. ఇరు దేశాలకు ఉమ్మడి సరిహద్దు అయిన అటనాసియా గిర్డాట్ అంతర్జాతీయ బ్రిడ్జ్ వద్ద ఇరు దేశాల అధ్యక్షులు గురువారం సమావేశమయ్యారు. వాణిజ్య ఒప్పందంపై వెనిజులా, కొలంబియా అధ్యక్షులు నికోలస్ మదురో, గుత్సావో పెట్రో సంతకం చేశారు. ఈ ఒప్పందంతో వాణిజ్య కార్యాచరణకు ఇప్పటి వరకూ ఉన్న అడ్డంకులు తొలగిపొతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య పునరేకీకరణకు ఈ ఒప్పందం సహకరిస్తుందని వెనిజులా అధ్యక్షులు మదురో చెప్పారు. ఈ నెల 3న రెండు దేశాల మధ్య పెట్టుబడులను ప్రోత్సహించడానికి, రక్షించడానికి ఒక ఒప్పందంపై కొలంబియా వాణిజ్య, పరిశ్రమ, టూరిజం శాఖల మంత్రి ఉమానా మెండోజా, వెనిజులా అధ్యక్షులు మదురో సంతకాలు చేశారు.