Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుమానితుడి అరెస్టు
మిస్సిస్సిపి : అమెరికా మిస్సిస్సిప్పీ టేట్ కౌంటీలో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి టేట్ కౌంటీ షెరీఫ్ బ్రాడ్ లాన్స్ తెలిపిన వివరాల ప్రకారం ఆగంతకుడు అర్కబుట్ల రోడ్డులోని ఓ దుకాణంలో ఒకరిని కాల్చివేశాడు. అర్కబుట్ల డ్యామ్ రోడ్డులోని ఓ ఇంట్లో మహిళను కూడా తుపాకితో కాల్చివేశాడు. ఈ ఘటనలో ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రోడ్డులో అనుమానితుడిని గుర్తించిన టేట్ కౌంటీ సహాయకులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మరో నలుగురు హత్యకు గురైనట్లు అధికారులు గుర్తించారు. అర్కబుట్ల ఆనకట్ట రోడ్డులో ఇంటి లోపల ఇద్దరు, బయట మరో ఇద్దరు మరణించి కనిపించారు. 'బాధ్యుడైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
అతను ఒంటరిగానే హత్యలకు పాల్పడ్డాడని భావిస్తున్నాం. ఎందుకు ఈ హత్యలకు పాల్పడ్డాడో తెలియలేదు. మిస్సిస్సిప్పి బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎంబిఐ) దర్యాప్తులో సహాయం కోరింది. అన్ని విధాలా సహకరిస్తాం.' అని మిస్సిస్సిప్పి గవర్నర్ టేట్ రీవ్స్ ట్వీట్ చేశారు.
అమ్మమ్మను తుపాకితో కాల్చిన ఆరేళ్ల బాలిక
ఆరేళ్ల బాలిక కారు నడుపుతున్న అమ్మమ్మను వెనుకసీటులో ఉన్న తుపాకితో కాల్చివేసింది. ఈ ఘటనలో ఆమె ప్రాణాలతో బయటపడింది. నార్త్ పోర్ట్ పోలీసు శాఖ శనివారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 'ఈ నెల 16న 57 ఏళ్ల మహిళ తన మహిళ తన ఆరేళ్ల మనవరాలిని వెనుక సీటులో కూర్చోబెట్టుకుని కారు నడుపుతోంది. డ్రైవర్ సీటు వెనుక జేబులో ఉన్న తుపాకి తీసి ఆ బాలిక కాల్చింది. ఆ మహిళ కారును ఇంటి వరకూ నడుపుకుని వెళ్లింది. ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసింది. దీంతో, ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రాణానికి ప్రమాదం లేదు' అని పేర్కొంది. 'యాక్సిడెంటల్'గా కాల్పులు జరిగినట్లు నార్త్ పోర్ట్‌లోని చైల్డ్ ప్రొటక్షన్ సెంటర్ తెలిపింది. పిల్లలు తుపాకులు వినియోగించకుండా తగిన చర్యలు తీసుకోవాలని కుటుంబాలకు పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.