Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : ఎయిర్‌బెలూన్ సంఘటనపై వైఖరి మార్చుకోవాలని అమెరికాకు చైనా విజ్ఞప్తి చేసింది. అమెరికా విదేశాంగ మంత్రి అంటోని బ్లింకెన్‌తో జరిగిన అనధికార సమావేశంలో చైనా దౌత్య వేత్త వాంగ్ యీ ఈ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జరుగుతున్న మునిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ (ఎంఎస్సి) నేపథ్యంలో అమెరికా వైపు నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈ సమావేశం జరిగింది. ఎయిర్‌బెలూన్ సంఘటనపై చైనా వైఖరి స్పష్టంగా ఉందని, ఈ సంఘటన వల్ల ఏర్పడిన ద్వైపాక్షిక నష్టాన్ని అమెరికానే పరిష్కరించాలని వాంగ్ యీ ఈ సమావేశంలో స్పష్టం చేశారు. శనివారం జరిగిన ఈ సమావేశం వివరాలను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం తన వైబ్సైట్లో వెల్లడించింది.