Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తగా 500 మిలియన్ డాలర్ల సైనిక సహాయానికి హామీ
కీవ్ : అమెరికా అధ్యక్షులు జో బైడెన్ సోమవారం ఆకస్మికంగా ఉక్రెయిన్‌లో ప్రత్యక్షమయ్యారు. ఆ దేశ అధ్యక్షులు వోలోదమర్ జెలెన్స్కీతో సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌కు కొత్తగా 500 మిలియన్ డాలర్ల సైనిక సహాయానికి బైడెన్ హామీ ఇచ్చారు. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ప్రారంభమై త్వరలో ఏడాది పూర్తి కాబోతున్న సమయంలో ఈ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌కు తమ మద్దతు గురించి వెల్లడించడంతో పాటు, ఉక్రెయిన్‌కు సంఘీభావంగా మిత్రదేశాలను ఏకం చేయడమే బైడెన్ పర్యటన ఉద్దేశంగా కనిపిస్తోంది. బైడెన్ పర్యటన సందర్భంగా సోమవారం కీవ్ అంతటా వైమానిక దాడుల సెరన్ను మోగించారు. అయితే రష్యా వైమానిక దాడులకు పాల్పడినట్లు ఎలాంటి వార్తలూ రాలేదు. ఉక్రెయిన్ అధ్యక్ష భవనం 'మారియిన్స్కీ ప్యాలెస్'లో బైడెన్-జెలెన్స్కీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ 'యుద్ధంలో ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతు గురించి ఎటువంటి సందేహం వద్దు. సందేహం ఉండదని కూడా నేను అనుకుంటున్నాను' అని అన్నారు.