Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢాకా : వార్తాపత్రిక నిబంధనలను ఉల్లంఘించారంటూ ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రముఖ పత్రిక 'దైనిక్ దిన్కాల్'పై బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మానసపుత్రిక ముద్రణ నిలిచి పోయిందని స్థానిక మీడియా తెలిపింది. ప్రభుత్వ ఆంక్షలతో వందలాది మంది జర్నలిస్టులు, ప్రెస్ కార్మికులతో మూడు దశాబ్దాలుగా నడుస్తున్న పత్రిక మూగపోయిందని పేర్కొంది. అలాగే బీఎస్పీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించడంతో పాటు అరెస్టులు చేసినట్టు వివరించింది. గతేడాది డిసెంబర్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూసివేత ఆదేశాలను బంగ్లాదేశ్ ప్రెస్ కౌన్సిల్ కూడా ఆదివారం సమర్థిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. దేశంలోని ముద్రణ, ప్రచురణ చట్టాలను ఉల్లంఘించినందున వార్తాపత్రిక ముద్రణ అనుమతిని రద్దు చేసినట్టు ఆ ప్రకటనలో తెలిపింది. బీఎన్పీ యాక్టింగ్ చీఫ్, పేపర్ పబ్లిషర్ తారిక్ రెహ మాన్ తన బాధ్యతలను మరెవరికీ అప్పగించకుండా విదేశాలకు వెళ్లడంతో ఆయనను నిందితుడిగా నిర్థా రిస్తున్నట్టు కౌన్సిల్ పేర్కొంది. ప్రభుత్వ, బంగ్లాదేశ్ ప్రెస్ కౌన్సిల్ ఆరోపణలను దైనిక్ దిన్కాల్ మేనేజింగ్ ఎడిటర్ షిముల్ బిస్వాస్ ఖండించారు. తారిక్ రెహమాన్ వార్తాపత్రిక బాధ్యతలకు రాజీనామా చేశా రని, గత కొన్నేళ్లుగా లండన్లో నివసిస్తున్నారని అన్నారు. కానీ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించా రంటూ నిషేధం విధించిందని మండిపడ్డారు. ముద్ర ణను నిలిపివేయాలంటూ జిల్లా మెజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను వెనక్కు తీసుకోవాల్సిందిగా ప్రెస్ కౌన్సి ల్ను కోరగా తిరస్కరించినట్లు తెలిపారు. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి అని, ప్రభుత్వ అసమర్థ తలను వెల్లడిస్తున్న గొంతులకపై అణచివేతగా బిస్వాస్ పేర్కొన్నారు. దేశ రాజధాని ఢాకాకు చెందిన పలువురు జర్నలిస్టులు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ ఉత్తర్వులు ప్రతిపక్షాల గొంతుక అణచివేతకు నిదర్శనమని పేర్కొన్నాయి. కాగా, గతేడాది రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ విడుదల చేసిన 'వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్'లో బంగ్లాదేశ్ 162వ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.