Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో : రెండు దేశాల మధ్య నెలకొన్న స్థానిక సమస్యను ప్రపంచ యుద్ధంగా మార్చేందుకు అమెరికా వంటి పశ్చిమ దేశాలు యత్నిస్తున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలను ప్రారంభించి ఏడాది కావస్తున్న సందర్భంగా మంగళవారం పుతిన్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ... ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలను క్రమపద్ధతిలో ముందుకు తీసుకువెళతామని అన్నారు. దశల వారీగా, తాము ఎదుర్కొంటున్న సైనిక లక్ష్యాలను జాగ్రత్తగా, క్రమపద్ధతిలో పరిష్కరిస్తామని అన్నారు. ఉక్రెయిన్‌లో సైనిక దాడులు తీవ్రతరం కావడానికి పశ్చిమదేశాలదే పూర్తి బాధ్యత అని కూడా అన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి ఆజ్యం పోయడం, బాధితుల సంఖ్య పెరగడం వెనుక పూర్తి బాధ్యత పశ్చిమ దేశాల ప్రముఖులదేనని చెప్పారు. తాము తగిన సమయంలో తగిన విధంగా ప్రతిస్పందిస్తామని అన్నారు. తాము తమ దేశ ఉనికి గురించి మాట్లాడుతున్నామని చెప్పారు.
ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తి కావస్తున్న తరుణంలో బైడెన్ పర్యటన ఆసక్తికరంగా మారింది. పశ్చిమ దేశాలకు నమ్మిన బంటుగా ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో బైడెన్ కీవ్‌లోని అధ్యక్ష భవనంలో రహస్యంగా మంతనాలు జరిపారు. అనంతరం ఉక్రెయిన్‌కు కొత్తగా 50 కోట్ల డాలర్లు (రూ.4,000 కోట్లు) సైనిక సహాయం అందించనున్నటు బైడెన్ ప్రకటించారు. ఉక్రెయిన్‌కు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని అన్నార.