Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రష్యా : రష్యా కొత్త రెస్క్యూ క్యాప్సూల్స్‌ను శుక్రవారం కజికిస్తాన్ నుంచి పంపించింది. వ్యోమగాములకు సంబంధించిన సామాగ్రిని ఈ రెస్క్యూ తీసుకెళుతుందని ఐఎస్ఎస్ అధికారులు వెల్లడించారు. ఇది మరో రెండు రోజుల్లో అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించనుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అమెరికాకు చెందిన ఫ్రాంక్ రూబియో, రష్యా వ్యోమగాములు డిమి త్రి, పెటెలిన్, సెర్గీ ప్రోకోపీవ్ ఐఎస్ఎస్ (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం)కి గత సెప్టెంబర్‌లో చేరుకున్నారు. వారి మిషన్ మరో ఆరు నెలలపాటు కొనసాగనుంది. వారి రిటర్న్ వాహనం శీతలీకరణని లీక్ సిందని, మైక్రో మీటర్స్ అలా జరగడానికి కారణమై ఉండొచ్చునని అమెరికా, రష్యన్ అంతరిక్ష అధికారులు భావించారు. కొంత ఆలస్యమైనా వ్యోమగాములకు కావలసిన సామాగ్రిని రెస్క్యూ క్యాప్సూల్స్ ద్వారా శుక్రవారం అంతరిక్షంలోకి రష్యా పంపించింది. ఈ వ్యోమగాములు ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఐఎస్ఎస్ లోనే ఉండనున్నారు. కొత్త వ్యోమగాములు వెళ్లేందుకు సిద్ధమైనప్పుడు మాత్ర మే వారు భూమికి తిరిగిరానున్నారని ఐఎస్ఎస్ అధికారులు వెల్లడించారు.