Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరింత ముందుకు : మదురో
కారాకస్ : బ్రెజిల్‌తో తమ దేశ సహకారం మరింత ముందుకు వెళుతుందని వెనిజులా అధ్యక్షులు నికోలస్ మదురో తెలిపారు. 'బ్రెజిల్-వెనిజులా మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణకు మార్గం తెరిచి ఉంది. ఇరు దేశాల మధ్య సోదర భావం, సహకారంలో కొత్త దశను నేను ఆవిష్కరిస్తాను' అని మదురో ట్వీట్ చేశారు. బ్రెజిల్‌కు వెనిజులా రాయబారిగా మాన్యుయెల్ వాడెల్‌ను శుక్రవారం నియమించిన సందర్భంగా మదురో ఈ ట్వీట్ చేశారు. సంబంధాల పునరుద్ధరణలో భాగంగానే ఇరు దేశాల రాయబార కార్యాలయాలను పున:ప్రారం భిస్తున్నట్లు చెప్పారు. 2019లో బోల్సోనారో అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి బ్రెజిల్-వెనిజులా మధ్య సంబంధాలు క్షీణిస్తూ వచ్చాయి. ఇటీవల బ్రెజిల్ అధ్యక్షుడిగా లూలా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడంతో, ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి.