Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెర్లిన్, పారిస్ : ఉక్రెయిన్ సంక్షోభంలో తమ దేశ ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడాన్ని జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో భారీ నిరసన ర్యాలీలు జరిగాయి. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో బ్రాండెన్‌బర్గ్ గేట్ వద్ద ఈ నెల 25న 'శాంతి కోసం తిరుగుబాటు' పేరుతో వేలాది మంది ర్యాలీ నిర్వహించారు. ఉక్రెయిన్‌లో సంక్షోభం ముగించడానికి చర్చలను ప్రోత్సహించడంలో దేశ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ క్రీయాశీల పాత్ర పోషించాలని వేలాది మంది జర్మన్లు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉక్రెయిన్‌కు అధునాతన ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పంపిణీ చేస్తూ సంక్షోభాన్ని మరింత పెంచడానికి బదులుగా చర్చలు, దౌత్యం, శాంతి కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో లెఫ్ట పార్టీ ఎంపి సహ్రా వాగెంనెంచ్, రిటైర్డ్ బ్రిగేడియర్ జనరల్ ఎరిచ్ వాద్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. శాంతి చర్చల కోసం బలమైన కూటమిని ఏర్పాటు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీకి ఒక రోజు ముందు కూడా ఇదే ప్రాంతంలో బెర్లిన్ పీస్ కో ఆర్డినేషన్, జర్మన్ కమ్యూనిస్ట్ పార్టీ, ఇతరులు శాంతి కోసం పిలుపునిస్తూ భారీ ర్యాలీ చేశాయి.
ఫ్రాన్స్ యొక్క నాటో సభ్యత్వాన్నికి వ్యతిరేకంగానూ, అలాగే సంక్షోభంలో ఉక్రెయిన్‌కు ఫ్రాన్స్ నిరంతర మద్దతును వ్యతిరేకిస్తూ రాజధాని పారిస్‌తో పాటు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వరసగా రెండో వారం కూడా సామూహిక నిరసన ప్రదర్శనలు జరిగాయి. పారిస్‌లో ఆదివారం జరిగిన నేషనల్ మార్చ్ ఫర్ పీస్ కార్యక్రమానికి గత వారం కంటే అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ వారం సుమారు 10 వేల మంది హజరైనట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా మరో 30 ప్రాంతాల్లో కూడా నాటో వ్యతిరేక నిరసనలు జరిగినట్లు చెప్పారు. అమెరికా నేతృత్వంలోని నాటో నుంచి, ఇయు నుంచి ఫ్రాన్స్ బయటకు రావాలని నిరసనకారులు పిలుపునిచ్చారు. ప్రస్తుత అధ్యక్షులు మాక్రెన్ గెట్ అవుట్ అని కూడా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాటో, ఇయు జెండాలను ప్రజలు దగ్ధం చేశారు.