Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెల్లింగ్టన్: ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ ఎంపీ జార్జినా బెయెర్(65) కన్ను మూశారు. చాలాకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడు తున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని బెయెర్ ఫ్రెండ్ ఒకరు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. న్యూజిలాండ్ నార్త్ ఐలాండ్‌లో మారుమూల గ్రామంలో జన్మించిన బెయెర్ తొలినాళ్లలో సెక్స్వర్కర్గానూ పనిచేశారు. ఆ తర్వాత నటిగా, డ్రాగ్ క్వీన్‌గా అలరించారు. కార్టర్టన్కు మేయర్‌గానూ ఎన్నికయ్యారు. ఈ పదవి చేపట్టిన తొలి ట్రాన్స్‌జెండర్ కూడా ఈమే కావడం గమనార్హం. 1999లో లేబర్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచి తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు బెయెర్. 2007 వరకు ఎంపీగా కొనసాగారు. ఎల్జీబీటీక్యూ హక్కుల కోసం పోరాడిన న్యాయవాదిగానూ బెయెర్ గుర్తింపుపొందారు. సెక్స్‌వర్కర్లపై వివక్షపైనా గళమెత్తి వాళ్లకు అండగా నిలబడ్డారు. వ్యభిచారం నేరంకాదనే చట్టాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.