Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 మంది మృతి
- 100 మందికి పైగా గాయాలు
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మంగళవారం భారీ ప్రమాదం సంభ వించింది. రద్దీగా ఉండే ప్రాంతంలోని ఏడు అంతస్తుల భవనంలో జరిగిన పేలుడు ఘటనలో 14 మంది మరణిం చగా, మరో 100 మందికి పైగా గాయ పడ్డారు. సాయంత్రం 4.50గంటల సమ యంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పాత ఢాకాలోని గౌలిస్తాన్ ప్రాంతంలో ఈ ప్రమాదం గురించి తెలిసినవెంటనే అగ్నిమాపక సిబ్బంది, సహాయక సిబ్బంది అక్కడకు చేరు కున్నారు. మంటలను అదుపు చేయ డానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. క్షతగాత్రులను ఢాకా వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలి పారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. పేలుడుకు గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ పేలుడు ధాటికి భవనంలోని తొలి రెండు అంతస్తులు తీవ్రంగా ధ్వంసమయ్యాయని అధికారులు చెప్పారు. ఈ భవనంలోని కింది అంతస్తులో శానిటరీ ఉత్పత్తులు, గృహోపకరణాలకు సంబంధించిన దుకాణాలు ఉండగా భవనం పక్కనే ఓ బ్యాంకు శాఖ ఉంది. బ్యాంక్ భవనం కూడా దెబ్బతింది. బ్యాంకులో అద్దాలు పగలడంతో ఆ గాజు పెంకులు తగిలి పలువురు ఉద్యోగులకు గాయాలైనట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, బంగ్లాదేశ్లో వారం రోజుల వ్యవధిలోనే ఇది మూడో పేలుడు ఘటన కావడం ఆందోళన కలిగిస్తుంది.