Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐరాస సెక్రెటరీ జనరల్ గుటెరస్
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులు తీవ్ర ఉల్లంఘనలకు, దుర్వినియోగానికి గురవుతున్నట్లు ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే ధోరణి కొనసాగితే.. స్త్రీ, పురుష సమానత్వ సాధనకు మరో 300 ఏండ్లు పడుతుందని ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు. స్త్రీ, పురుష సమానత్వ సాధనకు పనిచేస్తోన్న 'మహిళల స్థితిగతులపై ఐరాస కమిషన్' ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గుటెరస్ పాల్గొని ఈ మేరకు ప్రసంగించారు.'ఉక్రెయిన్ నుంచి సాహెల్ ప్రాంతం(ఆఫ్రికా) వరకు సంక్షోభాలు, సంఘర్షణల ప్రభావం.. మొదట మహిళలు, బాలికలపైనే పడింది. పితృస్వామ్య పోకడలు మళ్లీ జడలు విప్పుతోన్న నేపథ్యంలో.. దశాబ్దాలుగా సాధించిన పురోగతి కనుమరుగవుతోంది. అఫ్గానిస్థాన్లో మహిళలు, బాలికలను ప్రజాజీవితానికి దూరం చేశారు. అనేక దేశాల్లో మహిళల లైంగిక, సంతానోత్పత్తి హక్కులనూ లాగేసుకుంటున్నారు. కొన్ని చోట్ల బాలికలకు కిడ్నాప్, వేధింపుల ముప్పు పొంచి ఉంది. మాతాశిశు మరణాలు పెరుగుతున్నాయి. కొవిడ్ ప్రభావంతో.. వారి విద్యా, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి' అని గుటెరస్ వ్యాఖ్యానించారు.