Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: శాశ్వతంగా అధికారం లో ఉంటామనే భ్రమలో బీజేపీ ఉందని, అయితే అలా జరగదని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత్లో ప్రజాస్వా మ్యానికి జరిగిన నష్టాన్ని చక్కదిద్ద టానికి ప్రతిపక్షాలు కలిసికట్టుగా ఉన్నాయని రాహుల్ చెప్పారు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ లండన్లోని చతం హౌస్లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిం చారు. 'బీజేపీ పదేండ్లు అధికారంలో ఉండక ముందు మేం పదేండ్లు అధికారంలో ఉన్నాం. అయితే తాము దేశంలో అధికారంలోకి వచ్చామని, ఇక శాశ్వతంగా అధికారంలో ఉంటామని బీజేపీ భ్రమ పడుతుంది. కానీ అలా జరగదు' అని రాహుల్ చెప్పారు. భారత్లో ప్రజాస్వామ్యం కుప్పకూలితే అది ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థకే పెద్ద ముప్పుగా వర్ణించారు. కాబట్టి భారత్లో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అందరి బాధ్యతగా తెలిపారు.