Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బొగోటా : కొలంబియా ప్రభుత్వానికి, నేషనల్ లిబరేషన్ ఆర్మీ (ఇఎల్ఎన్) మధ్య జరగనున్న శాంతి చర్చలకు క్యూబా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు క్యూబా అధ్యక్షులు గుస్తావో పెట్రో పార్టీ హ్యూమన్ కొలంబియా, ఇఎల్ఎన్ పార్టీలు మెక్సికో సిటీ నుండి ఉమ్మడి ప్రకటన చేశాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల జాబితాలో కరేబియన్ దీవిని చేర్చడం అన్యాయమని ఈ ప్రకటన తెలిపింది. కొలంబియన్ల మధ్య సయోధ్యకు, శాంతి చర్చలకు క్యూబా ఎప్పుడూ మద్దతుగా నిలుస్తుందని ఈ ప్రకటన పేర్కొంది. త్వరలో క్యూబాలో జరగనున్న శాంతి చర్చలకు రెండు పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు క్యూబాకు వెళ్లనున్నారు. కాగా, ఈ శాంతి చర్చలపై క్యూబా అధ్యక్షులు మిగ్యుల్ డియాజ్ కానెల్ మాట్లాడుతూ శాంతి చర్చలకు తాము చేసిన అభ్యర్థనను అంగీకరించడం ఇరు పార్టీలూ క్యూబా ప్రభుత్వానికి ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు.