Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంకారా : గత నెల్లో తీవ్ర భూకంపం సంభవించినప్పటికీ టర్కీ లో షెడ్యూల్ కన్నా ఒక నెల ముందు గానే పార్లమెంటరీ, అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. మే 14న ఈ ఎన్నికలు నిర్వహించడానికి శుక్రవారం అధ్యక్షుడు రెసెప్ తైయీప్ ఎర్డోగన్ ప్రకటించారు. రెండు దశాబ్దాల పాటు అధికారంలో వున్న ఎర్డోగన్ ఈసారి కూడా ఎన్నికవాలని భావిస్తున్నారు. దశాబ్దాల కాలంలో దేశంలోనే అత్యం త ప్రాధాన్యత కలిగిన ఎన్నికలుగా వీటిని పరిగణిస్తున్నారు. మరింత ప్రజాస్వామ్య పంథాలో పయనించ డమా లేక బలమైన నేత ఎర్డోగన్ నిర్దే శించిన నిరంకుశ పంథాలో ముందు కు సాగడమా అనేది ఈ ఎన్నికలు నిర్ణయించనున్నాయి. 2003 నుండి ఎర్డోగన్ టర్కీని పాలిస్తున్నారు.