Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెనీవా: కోవిడ్-19 వైరస్ ఎలా ఉద్భవించిందో కనుగొనడంపై దర్యాప్తునకు కట్టుబడి ఉన్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పునరుద్ఘాటించింది. వైరస్ మూలాలను కనుగొనడం నైతిక ఆవశ్యకత అని, అన్ని వైపులను నుంచి పరిశోధన ముఖ్యమని మరోసారి డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. చైనా లేబొరేటరీ అనాలోచిత లీక్ వల్ల వైరస్ ఉద్భవించినట్లు అంచనా వేస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రచురించినట్లు అమెరికా మీడియాలో కథనాలు రావడంతో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ఈ విషయాన్ని ప్రకటించారు. 'కోవిడ్-19 మూలలను అర్థం చేసుకోవడం, అన్ని వైపుల నుంచి అన్వేషించడం ఇంకా మిగిలే ఉంది. ఈ వైరస్‌తో మరణించిన, దీర్ఘకాలిక కోవిడ్‌తో జీవిస్తున్న కోట్లాది మంది కోసం, అలాగే భవిష్యత్‌లో వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో మాకు ఈ దర్యాప్తు నైతికత ఆవశ్యకత' అని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఘేబ్రాయెసుస్ శనివారం రాత్రి ట్వీట్ చేశారు. కరోనా వైరస్ ఆవిర్భావంపై దర్యాప్తు కోసం డబ్ల్యూహెచ్ఓ నేతృత్వంలోని బృందం 2021లో చైనాలోని వుహాన్ పరిసర ప్రాంతాల్లో కొన్ని వారాలు గడిపిన సంగతి తెలిసిందే. తదుపరి పరిశోధన అవసరమని నివేదిక ఇచ్చింది. ఈ తరువాత డబ్ల్యూహెచ్ఓ ఒక శాస్త్రీయ సలహా బృందాన్ని ఏర్పాటు చేసింది. కానీ వైరస్ పుట్టకపై ఇంకా ఎటు వంటి నిర్థారణలకు రాలేదు.