Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐరాస చీఫ్ గుటెరస్ పిలుపు
వాషింగ్టన్ : ముస్లింలపై జరుగుతున్న దాడులను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి ఐక్యరాజ్యసమతి చీఫ్ ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. మార్చి 15ను అంతర్జాతీయ ఇస్లాం ఫోబియో వ్యతిరేక దినోత్సవంగా నిర్వహించుకుంటున్న నేపథ్యంలో గుటెరస్ ఈ పిలునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 200 కోట్ల మంది ముస్లింలు మానవత్వం, దాని అద్భుతమైన వైవిధ్యానికి ప్రతిబింబిస్తున్నారనీ, అయితే వారి విశ్వాసం కారణంగా వారు తరచూ దాడులకు, పక్షపాతానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత దాడులకు, విద్వేష వ్యాఖ్యలకు ముస్లింలు బలిపశవులు అవుతున్నారని తెలిపారు. నియో నాజీల ఆధిపత్య సిద్ధాంతాలు, జాతీయ వాదం, హింస యొక్క పునరుజ్జీవనం కారణంగా ముస్లిం వ్యతిరేక భావజాలం పెరుగుతుందని గుటెరస్ విమర్శించారు. 'వివక్ష మనందరినీ నాశనం చేస్తున్నది. హింసకు వ్యతిరేకంగా నిలబడ్డం మనందరి బాధ్యత' అన్నారు. 'మానవ హక్కులను.