Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబో : బెయిలవుట్ కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) విధించిన షరతుల్లో భాగంగా శ్రీలంకలో పన్నులను విపరీతంగా పెంచడాన్ని నిరసిస్తూ 40కి పైగా కార్మిక సంఘాలకు చెందిన వేలాదిమంది కార్మికులు దేశవ్యాప్త సమ్మె నిర్వహించారు. రైల్వే, ఆస్పత్రులు, పాఠశాలలు, ఓడరేవులు ఇలా ప్రభుత్వ రంగానికి చెందిన వేలాదిమంది కార్మికులు సంపూర్ణంగా సమ్మె చేశారు. ఆదాయ పన్ను, విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచడాన్ని వారు తీవ్రంగా నిరసించారు.దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల పిలుపు నేపథ్యంలో ఆందోళనల్లో పాల్గొనకుండా తమని ప్రభుత్వం అడ్డగించలేదని కార్మికులు పేర్కొన్నారు. గతంలో అత్యవసర చట్టాల ద్వారా అన్ని రకాల సమ్మెలను ప్రభుత్వం నిషేధించింది. రణిల్ విక్రమసింఘె ప్రభుత్వ అణచివేత చర్యలను, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వేలాదిమంది ప్రజలు వీధుల్లోకి వచ్చారని కార్మిక సంఘ నేత వసంత సమరసింఘా తెలిపారు.