Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాక్రాన్ ప్రభుత్వ చర్యపై ఫ్రాన్స్ అంతటా నిరసనలు
పారిస్: ఫ్రెంచ్ పార్లమెంటు ఆమోదం లేకుండానే అధ్యక్షుడు ఇమ్మానియెల్ మాక్రాన్ పెన్షన్ కోతలను విధించడంతో దేశమంత టా నిరసన జ్వాలలు వ్యాపించాయి. పింఛను పై కోతలు విధిస్తున్నట్లు ప్రధాన మంత్రి ఎలిజబెత్ బోర్న్ ప్రకటించడంతో ప్రధాన నగరాల్లో గురువారం రాత్రి నుంచే పెద్దయెత్తున నిరసనలు మొదలయ్యాయి. నిరసనకారులను అణచివేసేందుకు మాక్రాన్ ప్రభుత్వం ప్రయత్నించడంతో ఘర్షణలు చెలరేగాయి. మాక్రాన్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, ప్రజల అభీష్టాన్ని తుంగలో తొక్కుతోందని కార్మికవర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్రెంచ్ ప్రజలలో మూడొంతుల మంది పెన్షన్ కోతలను వ్యతిరేకిస్తున్నా మాక్రాన్ పట్టించుకోడం లేదు. కోతలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసన సమ్మెలు రెండు నెలలుగా కొనసాగుతున్నాయి.