Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికా రాష్ట్రమైన మిన్నెసొటాలోని మాంటిసెల్లో అణు విద్యుత్ కర్మాగారం నుంచి దాదాపు నాలుగు లక్షల గ్యాలన్ల అణు ధార్మిక జలాలు లీకయ్యాయని ప్లాంట్ రెగ్యులేటర్లు వెల్లడించారు. ట్రిటియంతో కలుషితమైన నీటిని ప్రక్షాళన చేసేందుకు ఎక్సెల్ ఎనర్జీ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వ సంస్థలు పర్యవేక్షిస్తున్నాయని మిన్నెసొటా కాలుష్య నియంత్రణా సంస్థ (ఎంపీసీఏ) ఈ వారంలో తెలిపింది. గతేడాది నవంబరు చివరిలో రొటీన్‌గా భూగర్భ జలాలను పర్యవేక్షిస్తుండగా అసాధారణ ఫలితాలు కనుగొన్నట్టు అమెరికా అణు నియంత్రణా కమిషన్లకు ఎక్సెల్ ఎనర్జీ తెలియజేసింది. ఈ సమాచారాన్ని బహిరంగంగా ప్రకటించడంలో నాలుగు మాసాల జాప్యం జరగడంతో పారదర్శకత పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.