Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదానీ సంపద ఆవిరి
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల జాబితాను హురున్ రిచ్ లిస్ట్ విడుదల చేసింది. అత్యధిక మంది బిలియనీర్లు కలిగిన దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉన్నది.అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సంపద ఈ ఏడాది భారీగా కుంగినట్లు 'ఎం3ఎం హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ నివేదిక తెలిపింది. ఈ ఏడాదిలో ఆయన సగటున వారానికి రూ.3,000 కోట్లు కోల్పోయినట్టు పేర్కొంది. దీంతో ఆసియా ధనవంతుల జాబితాలో నుంచి అదానీ రెండో స్థానాన్ని కోల్పోయారు. రష్యాకు చెందిన ఝోంగ్ శాన్‌శాన్ ఆ స్థానానికి చేరారు. ప్రస్తుతం అదానీ సంపద 53 బిలియన్ డాలర్లుగా హురున్ నివేదిక లెక్కగట్టింది. విమానాశ్రయాల నుంచి వంట నూనెల వరకు వివిధ రంగాలకు విస్తరించిన అదానీ గ్రూప్ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల తర్వాత తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గ్రూప్‌నకు చెందిన నమోదిత సంస్థల మార్కెట్ విలువ గణనీయంగా తగ్గింది. ఒకప్పుడు ప్రపంచ ధనవంతుల జాబితాలో రెండో స్థానానికి చేరిన గౌతమ్ అదానీ ఇప్పుడు టాప్-20లో కూడా లేకపోవడం గమనార్హం. గరిష్ఠ స్థాయిల నుంచి ఆయన సంపద 60 శాతానికి పైగా తగ్గింది. ఇక హిండెన్‌బర్గ్ నివేదిక జనవరి 24న విడుదలైంది. అప్పటి నుంచి అదానీ గ్రూప్ లోని నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.7.11 లక్షల కోట్లు ఆవిరైందని లెక్క కట్టింది.