Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 200 కోట్ల డాలర్ల రోల్ ఓవర్ డిపాజిట్లు
ఇస్లామాబాద్ : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు చైనా చేయూతనందించింది. ఏడాది కాలంలో చైనా నుంచి పాక్ 200 కోట్ల డాలర్ల రోల్ ఓవర్ డిపాజిట్ల అందుకుంది. నగదు సంక్షోభంలో కూరుకుపోయిన పాక్.. తన ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేసుకునేందుకు ఐఎంఎఫ్ నుండి బెయిలవుట్ ప్యాకేజీని పొందాలంటే ముందుగా చైనా నుండి ఈ డిపాజిట్లు తీసుకోవడం తప్పనిసరి అయిందని స్థానిక మీడియా పేర్కొంది. ప్రాధమికంగా రోల్ ఓవర్ అంటే రుణం కాదు. కానీ ఏడాది కాలం పాటు పాకిస్తాన్ కేంద్ర బ్యాంక్ లో వుంచే ఆర్థిక డిపాజిట్. సిబ్బంది స్థాయిలో ఒప్పందం కుదుర్చుకునే దిశగా ముందుకు కదలాలంటే ఐఎంఎఫ్ బాహ్య ఆర్థికావసరాలను తీర్చడంలో ఈ రోల్ఓవర్ డిపాజిట్ ఒకటని ది న్యూస్ ఇంటర్నేషనల్ పేర్కొంది. పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దర్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. 110 కోట్ల డాలర్ల రుణం కోసం ఫిబ్రవరి నుండి ఐఎంఎఫ్, పాకిస్తాన్ చర్చలు జరుపుతున్నాయి.