Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: హెచ్1బీ వీసా తో అమెరికా పని చేస్తున్న విదేశీ సాంకేతిక నిపుణులకు, ఉద్యోగులకు అనుకూలంగా అక్కడి న్యాయస్థానం తీర్పునిచ్చింది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ మేరకు 'సేవ్ జాబ్స్ యూఎస్ఏ' సంస్థ దాఖలు చేసిన దావాను యూఎస్ జిల్లా న్యాయమూర్తి తన్యా చుక్తాన్ కొట్టివేశారు. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హెచ్1బీ వీసాతో అమెరికాలో పని చేస్తున్న వారి జీవితభాగస్వామి కూడా ఉద్యోగం చేసుకునేందుకు వీలు కలిగేలా చట్టంలో సవరణలు తీసుకొచ్చారు. దీనివల్ల స్థానికంగా ఉన్న వారికి ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని, అందువల్ల హెచ్1బీ వీసాదారుల జీవితభాగస్వామి ఉద్యోగంలో చేరేందుకు వీలు కల్పించకుండా కోర్టు జోక్యం చేసుకోవాలని సేవ్ జాబ్స్ యూఎస్ఏ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అమెజాన్, యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఈ దావాను వ్యతిరేకించాయి.హెచ్1బీ వీసాదారులతోపాటు దాదాపు లక్షకు పైగా వారి జీవిత భాగస్వాముల ఉద్యోగాలు చేసుకునేలా గతంలో యూఎస్ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో ఎక్కువ మంది భారతీయులే ఉండటం గమనార్హం. తాజాగా కోర్టు వెలువరించిన తీర్పుతో అమెరికాలోని చాలా మంది భారతీయులకు ప్రయోజనం కలుగుతుంది.