Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉక్రెయిన్: భీకర పోరు జరుగుతున్న బాబ్మట్ను కోల్పోవటమంటే 'మా దేశం అలసిపోయి నట్టే. అలా అలసిపోయిన సమాజం నన్ను రాజీపడేలా చేస్తుంది' అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒక ఇంట ర్వ్యూలో అన్నారు. అమెరికా అండ లేకుండా ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగించలేదని అందరికీ తెలుసు. గత 13నెలలుగా రష్యాతో కొనసాగుతున్న యుద్ధంలో అపార నష్టాన్ని చవిచూసిన ఉక్రెయిన్ కోల్పోయిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోకుండా రష్యాతో రాజీపడితే ఆ దేశంలోని అజోవ్ బెటాలిన్ వంటి ఫాసిస్టు శక్తులు, ఉక్రెయిన్ యుద్ధానికి ఆజ్యంపోసిన అమెరికా అంగీకరించవు.
2022వ సంవత్సరం ఏప్రిల్ నెల తరువాత ఎటువంటి శాంతి చర్చలు జరగలేదు. అప్పటివరకు జరుగుతున్న శాంతి చర్చలకు ఆశ్చర్యకరంగా అమెరికా తరపున ఉక్రెయిన్ను దర్శించిన బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ జోక్యంతో ముగింపు పలికి యుద్ధాన్ని కొనసాగేలా చేయటం జరిగింది. అమెరికా నాయకత్వంలోని పశ్చిమ దేశాల లక్ష్యం పుతిన్ను లొంగదీసి, రష్యాను బలహీన పరచటంగా ఉంది.
ఆగస్టు నుంచి అనేకవేల మంది ప్రాణాలను కోల్పోయారు. బాఖ్మత్ కేంద్రంగా భీకర పోరు జరుగుతోంది. డోనెస్క్, లుగానె ప్రాంతాలమీద పట్టు సాధించాలంటే రష్యాకు బాఖ్మత్ మీద నియంత్రణ అవసరం. అలాగే బాఖ్మత్ యుద్ధంలో రష్యా సైన్యాన్ని బలహీన పరచటమే ఉక్రెయిన్, దాని మద్దతుదారులైన సామ్రాజ్యవాద పశ్చిమ దేశాల లక్ష్యంగా ఉంది. బాఖ్మత్ రష్యా ఆక్రమణ నుంచి రక్షించాలంటే వేలాది ఉక్రెయిన్ సైన్యం బలవ్వటం అనివార్యం.
అయినప్పటికీ జెలెన్స్కీ వెనక్కు తగ్గటం లేదు. అయితే అటువంటి ఎత్తుగడతో ప్రాణాలు పోవటం తప్ప ఉపయోగం ఏమీ ఉండదని ఉక్రెయిన్ సైన్యం భావిస్తున్నది. యుద్ధ రంగం నుంచి వచ్చిన సైనికులు తిరిగి యుద్ధంలో పాల్గొనటానికి సుముఖత చూపటంలేదు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా నష్టాలను మాత్రమే ఎత్తి చూపుతున్న పశ్చిమ దేశాల మీడియా ఉక్రెయిన్లో జరుగుతున్న అపార నష్టాన్ని తక్కువచేసి చూపుతోంది.
అమెరికా, నాటో దేశాల నుంచి వస్తున్న ధన, ఆయుధ సహాయం మత్తులలో తమ దేశవాసులు హననాన్ని నివారించటానికి జెలెన్స్కీ ఏమాత్రం ఆసక్తి చూపటం లేదు. ఇప్పటి వరకు దాదాపు 1.5లక్షల ఉక్రెయిన్ సైనికులు హతులయ్యారు. నాలుగు కోట్లమంది ప్రజలలో ఒక కోటిమంది కాందిశీకులుగా మారి వివిధ దేశాలలో తలదాచుక కుంటున్నారు.