Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్ఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్
వాషింగ్టన్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రపంచీకరింపబడిన తరువాత దేశాల మధ్య, ప్రజల మధ్య సంపద పంపిణీ న్యాయంగా జరగలేదని అంతర్జాతీయ ద్రవ్యనిధి మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జీవా అభిప్రాయపడింది. చైనాలో జరిగిన బోవావో ఫోరాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రజలు లాభపడాలంటే ప్రపంచీ కరణతో అంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంపొందిం చటానికి దేశాలు సమిష్టిగా పనిచేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం గ్లోబల్ సప్లై చైన్లు వైవిధ్యభరితంగాను ఉండాలని ఆమె అన్నారు. సప్లై చైన్లు తెగిపోవటంవల్ల ప్రపంచ స్థూల ఉత్పత్తిలో 7శాతం అధికంగా వ్యయం అవుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి పరిశోధనలో వెల్లడైంది. ఇలా నష్టపోతున్న దేశాలలో ఆసియా దేశాలు ముందున్నాయి. అధిక వడ్డీ రేట్లు, కరెన్సీ విలువ పడిపోవటం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న బలహీన దేశాలను సాపేక్షంగా బలమైన దేశాలు ఆదుకోవాలని ఆమె అన్నారు.
ఆసియా దేశాల మధ్య సహకారాన్ని పెంపొం దించటం, మిగిలిన ప్రపంచ దేశాలతో ఆర్థిక సంబంధాలను మెరుగుపర్చటం లక్ష్యంగా ''తూర్పు డావోస్''గా పేరొందిన బోవావో ఎకనామిక్ ఫోరమ్ 2001వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది.