Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: ఒక మాజీ పోర్న్‌స్టార్‌కు డొనాల్డ్ ట్రంప్ తరపు న కొంత పైకం చెల్లించటం జరిగిందనే ఆరోపణపై న్యూయార్క్ గ్రాండ్ జూరీ ట్రంప్‌ను అభిశంసించింది. ఒక మాజీ అమెరికా అధ్యక్షుడిపైన ఇటువంటి ఆరోపణలు రావటం అమెరికా రాజకీయాల దిగజారుడు తనాన్ని సూచిస్తోంది. ఈ అభిశంసనకు ప్రజాస్వామిక, రాజకీయ ప్రాధా న్యత లేదు. డెమోక్రాటిక్ పార్టీ తన రాజకీయ ప్రత్యర్థి ట్రంప్ పైన ఇంత నీచమైన దాడికి దిగటానికి సిద్దపడటం ఆశ్చర్యం. సదరు ఫోర్న్ సినిమా తార స్టోర్మీ డేనియల్స్కి 2016లో అమెరికా అధ్యక్షుడు కాకముందు చెల్లించిన మొత్తాన్ని గురించి ట్రంప్ అబద్దం ఆడాడనీ, తప్పుడు లెక్కలు రాశాడని అతనిపై అభియోగం మోపబడింది. ఈ విషయంపైనా డెమో క్రాటిక్ పార్టీ దృష్టిని కేంద్రీకరించటంవల్ల రిపబ్లికన్ పార్టీలోని ఫాసిస్టు విభాగం బలోపేతం అవుతుంది. తనను బలిపశువును చేశారని చెప్పు కునే అవకాశం ట్రంప్‌నకు ఇచ్చినట్టవుతుంది. 2021లో జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు చేసిన తిరుగుబాటుతో పాటు ట్రంప్ అనేక చట్టవిరుద్ద కార్యకలాపాలకు పాల్పడటం జరిగింది. వాటినన్నింటినీ వదలి ట్రంప్ పైన ఇటువంటి పనికిమాలిన ఆరోపణపైన డెమోక్రాటిక్ పార్టీ ఎందుకు తన దృష్టిని కేంద్రీకరిస్తున్నదన్న ప్రశ్న ముందుకు వస్తోంది. దీనికి కారణం రష్యా, చైనాలతో అమెరికా-నాటో కూటమి యుద్ధం చేయటానికి రిపబ్లికన్లతో రాజీపడి ఐక్యతను సాధించే ప్రక్రియలో భాగంగా ఇదంతా జరుగుతుందనే అభిప్రాయం అమెరికా రాజకీయాలను నిశితంగా పరిశీలించే వారిలో ఉంది.