Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : ఒక ప్రైవేట్ సంస్థ నిర్మించిన టిఎల్-2 వై1 లిక్విడ్ ప్యుయల్డ్ రాకెట్ మొట్టమొదటిసారి ఆదివారంనాడు ఒక ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహ ప్రయోగం వాయవ్య చైనాలోని జిక్యుయాన్ శాటిల్లైట్ లాంచ్ సెంటర్ నుంచి జరిగింది. ఈ సంవత్సరం 200లకి మించిన ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టాలని చైనా ప్రణాళికను సిద్దం చేసింది. ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టే టిఎల్-2 వై1 రాకెట్ ను బీజింగ్ స్థావరంగావున్న స్పేస్ పయోనీర్ సంస్థ అభివృద్ధి చేసింది. భూమికి 500 కిలోమీటర్ల పైనున్న కక్ష్యలో ఒక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ప్రవేశపెట్టింది. ఇలా చైనాలో అంతరిక్షంలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టే ప్రయివేటు సంస్థలలో స్పేస్ పయోనీర్ మూడవది. మిగిలిన రెండు సంస్థలు ఐ-స్పేస్, గలాక్టిక్ ఎనర్జీ. అయితే లిక్విడ్ ప్రొపెల్లాంట్ రాకెట్ ను మొట్టమొదటిగా అభివృద్ధి చేసింది మాత్రం స్పేస్ పయోనీరే.