Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరసనలు తెలుపుతున్న విద్యార్థులు
ఫ్రాన్స్: కార్మిక సంఘ నాయ కులు ఫ్రెంచ్ ప్రధాని ఎలిజబెత్ బోర్న్ను కలిసి పెన్షన్లలో కోత విధించటంపై రాజీ ప్రతిపాదన ను చేయటాన్ని కార్మికులు, యువత వ్యతిరేకిస్తున్నారు. అంత కుముందు ఫ్రెంచ్ జాతీయ ట్రేడ్ యూనియన్ సంస్థ(సిజిటి) 53వ కాంగ్రేస్లో అతివాద శక్తులకు, వామపక్షానికి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. 942మంది డెలిగేట్లు రెండుగా చీలిపోయారు. వామపక్షం తన మిలిటెంట్ వాదనలను కాంగ్రెస్ ముందు ఉంచింది. అంతిమంగా నాయకత్వాన్ని మితవాదులు నిలుపు కున్నప్పటికీ వామపక్షం ప్రభావశీలంగా వ్యవహరించింది. మాక్రాన్ ప్రజా వ్యతిరేక పాలనను, కార్మిక సంఘాలు అతని ప్రభుత్వం పట్ల రాజీధోరణిని ప్రదర్శించటాన్ని ప్యారిస్ లోని విశ్వవిద్యాలయాల విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సంపన్న వర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్న మాక్రాన్కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరును తీవ్రతరం చెయ్యాలని మూడింట రెండు వంతుల ఫ్రెంచ్ ప్రజలు భావిస్తున్నట్టుగానే ఈ విద్యార్థులు కూడా నిరసనల జోరును పెంచాలని కోరుకుంటున్నారు.
పార్లమెంటు ఆమోదం తీసుకోకుండా ఫ్రెంచ్ అధ్యక్షుడైన మాక్రాన్ ఫ్రెంచ్ రాజ్యాంగంలోని ప్రగతి నిరోధక 49.3 అధికరణను ఉపయోగించి పెన్షన్లలో కోతను విధించటాన్ని విద్యార్థులు కూడా వ్యతిరేకిస్తున్నారు. మాక్రాన్ ను ప్రజలు ఎన్నుకోవటానికి కారణం ప్రత్యర్థి మరైన్ లీ పెన్ అత్యంత తిరోగమనవాది కావటమేతప్ప అతని రాజకీయ కార్యక్రమాన్ని ఆమోదించి కాదని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. ఒక చట్టాన్ని 90శాతం కార్మికులు, 70శాతం ప్రజలు తిరస్కరిస్తున్నప్పుడు అటువంటి చట్టాన్ని బలవంతంగా రుద్దటమంటే అది ప్రజాస్వామ్యంపైన దాడి అవు తుందని వారు భావిస్తున్నారు. బడా కంపెనీలపై పన్నులు విధించాలని, ఫ్రాన్స్ లోని బ్యాంకులు 100బిలియన్ డాలర్లదాకా పన్ను చెల్లించటంలేదని వారు అంటున్నారు. కరోనా నుంచి ఫ్రెంచ్ సంపన్నులు వందలాది బిలియన్ల యూరోలతో తమ సమిష్టి సంపదను పెంచుకున్నారు. ఒకవైపు జనాభాలో కేవలం ఒకేఒక శాతంవున్న ధనిక వర్గం సంపద అనూహ్య పరిమాణంలో పోగుపడుతుండగా మరోవైపు కార్మికుల పదవీవిరమణ వయస్సును రెండేండ్లకు పొడిగించటం ఘోరమని యావత్ ఫ్రెంచ్ సమాజం ప్రతిఘటిస్తోంది.