Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై 34 నేరాభియోగాలు నమోదు అయిన విషయం తెలిసిందే. ఒకవేళ ఆ కేసుల్లో కోర్టు ట్రంప్‌ను దోషిగా తేల్చితే, అప్పుడు ఆయనకు కనీసం 136 ఏండ్ల జైలు శిక్ష పడే ఛాన్సు ఉన్నదని నిపుణులు భావిస్తున్నారు. హష్ మనీ కేసులో ఆయన వ్యాపార రికార్డులను తారుమారు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
హష్మనీ కేసులో...
హష్మనీ కేసులో ట్రంప్ తొలుత సరెండరై ఆ తర్వాత రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బిజినెస్ రికార్డులను మోసం చేసిన కేసులో ట్రంప్‌పై నేరాభియోగాలు నమోదయ్యాయి. ఒకవేళ ఆ కేసుల్లో ట్రంప్ దోషిగా తేలితే, భారీగా జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్టు న్యాయ నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఒకవేళ ట్రంప్
దోషిగా తేలినా.. అంత శిక్ష వేయకపోవచ్చు అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు లక్షా 30 వేల డాలర్లు చెల్లించిన అంశంలో.. ఆ నేరాన్ని కప్పిపుచ్చేందుకు ట్రంప్ తన బిజినెస్ రికార్డులను మార్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిలో భాగంగానే ఎన్నికల చట్టాలను కూడా మార్చే ఆలోచన చేసినట్టు డేనియల్స్ తరఫు న్యాయవాది ఆరోపించారు. ఆ హష్మనీ వివరాల్ని దాచిపెట్టేందుకు ట్రంప్ 34 తప్పుడు ఎంట్రీలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి.