Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్: కరడుగట్టిన వేర్పాటు వాది 'తైవాన్ ఇండిపెండెన్స్'కి చెందిన సియావో బి ఖిమ్పైన, మరో రెండు తైవాన్ సంస్థలతో బాటు అమెరికాకు చెందిన యుఎస్ హడ్సన్ ఇనిస్టి ట్యూట్, రొనాల్డ్ రీగన్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీపైన, నలుగురు అమెరికన్లపైన చైనా శుక్రవారం నాడు ఆంక్షలు విధిం చింది. కాలిఫోర్నియాలో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెకార్దీ తో తైవాన్ ప్రాంతీయ నేత త్సాయి ఇంగ్ వెన్ ఇటీవల జరిపిన సమావేశం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా ఈ ప్రతిచర్యలు తీసుకుంది.
ప్రజా స్వామ్య ం, స్వేచ్ఛ పేరుతో తైవాన్ వేర్పాటు వాదానికి మద్దతిచ్చిన ఏ సంస్థ లేదా వ్యక్తికైనా చైనా ఇదే తీరున స్పందిస్తుం దని తాజా ఆంక్షలు తెలియచేస్తు న్నాయని చైనా నిపుణులు భావిస్తు న్నారు. అమెరికా తైవాన్ కుమ్మక్కుపై ఈ చర్యలు ప్రతికూల ప్రభావాన్ని చూపించ గలవని, అమెరికా జాతీయ ప్రయోజనాల కోసం మితిమీరిన, కన్జర్వేటివ్ శక్తులు, తైవాన్ వేర్పాటు వాద శక్తుల మధ్య అనధికార కుమ్మక్కు కు అమెరికా ప్రభుత్వం పాల్పడకుండా హెచ్చరిస్తాయని పేర్కొన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీలోని తైవాన్ వ్యవహారాల విభాగం శుక్ర వారం ఈ ఆంక్షలను ప్రకటించింది. అమెరికాతో కుమ్మక్కైన తైవాన్ వేర్పాటు వాది సియావో బి కిమ్ తైవాన్ జలసంథుల మధ్య ఘర్షణల ను రెచ్చగొడుతున్నందుకు ఈ ఆంక్షలు విధించినట్లు ప్రకటించింది.