Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెపీ మోర్గాన్ హెచ్చరిక
న్యూయార్క్ : ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ జేపీ మోర్గాన్ నివేదిక ప్రకారం రానున్న రోజుల్లో అమెరికా మార్కెట్ కుదుపులకు గురికాబోతున్నది. అది 25శాతందాకా పడిపోయే పరిస్థితి ఉంది. దానితో ప్రజలు మార్కెట్కు దూరంగా ఉంటారనీ, ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక పరిస్థితి మెరుగైనప్పటికీ ఈ సంవత్సరం ద్వితియార్థంలో అమెరికా ఆర్థిక మాంద్యంలో ప్రవేశించే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ నివేదిక పేర్కొంది.అమెరికా ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న సంక్షోభం ఈమధ్య కాలంలో జరిగిన సిలికాన్ వ్యాలీ బ్యాంకు పతనంలో ప్రతిబింబించింది. ఈ ఆర్థిక సంక్షోభం మాంద్యంగా మారే అవకాశం ఉన్నదని జెపీ మోర్గాన్ చేజ్ సీఈఓ జామీ డిమోన్ అన్నారు. మార్చిలో సిలికాన్ వ్యాలీ బ్యాంకు, సిగేచర్ బ్యాంకు పతనమైన తరువాత ప్రజలు బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున తమ డిపాజిట్లను ఉపసంహరించుకోవటం జరిగింది. అటువంటి స్థితిలో పతనావస్థలోవున్న ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకులో 30బిలియన్ డాలర్ల డిపాజిట్లను ప్రముఖ అమెరికన్ బ్యాంకులు వేశాయి. అదే జరగకపోతే ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకు అమెరికాలో పతనమయిన మూడవ బ్యాంకు అయివుండేది. అలా అమెరికాలో మొదలయిన బ్యాంకుల పతనం ఐరోపాకు పాకింది. స్విట్జర్లాండ్ కు చెందిన క్రెడిట్ సూస్సేలో ఏర్పడిన సంక్షోభం ఆ దేశ కేంద్ర బ్యాంకు ప్రమేయంతో దాని ప్రత్యర్థి బ్యాంకుగావున్న యుబిఎస్ కైవసం చేసుకోవటంతో సమసిపోయింది.