Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్
అమెరికా తరపున ఘర్షణలలో పశ్చిమ ఐరోపా తలదూర్చగూడదని, ''వ్యూహాత్మక స్వతంత్రత''ను అను సరించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మా న్యుయల్ మాక్రాన్ అన్నారు. గత వారం చైనా పర్యటనలో పర్యటించిన ఆయన పొలిటికో అనే వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. 'తమవికాని సంక్షోభాలలో తలదూరిస్తే ఐరోపా ప్రమాదంలో పడుతుంది.
చిక్కేమిటంటే అటువంటి గందరగోళం నుంచి బయటపడే తొందరలో మేం కేవలం అమెరికా అనుయాయులుగా మారతాం. మేం వేసుకోవలసిన ప్రశ్న ఏమంటే తైవాన్ పైన మొదలైన సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తే మాకు ఒనగూరే ప్రయోజనం ఏమిటి? ఈ విషయంలో అమెరికా ఎజెండాను అనుసరించటం ఐరోపా ప్రయోజనాలకు అనుగుణంగా ఉండదు' అన్నారు.
ఈ ఇంటర్వ్యూకు ముందు మాక్రాన్ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ను కలిశారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించలేని ఐరోపా దేశాలు తైవాన్ సమస్యను ఎలా పరిష్కరించ గలుతాయి? అని ప్రశ్నించారు. మాక్రాన్ చైనా నుంచి నిష్క్రమించిన కొన్ని గంటల్లోనే చైనా తైవాన్‌కు సమీపంలో సైనిక విన్యాసాలను నిర్వహించింది. దానికి కారణం తైవాన్ అధ్యక్షురాలు, సై ఇంగ్ వెన్ అమెరికాను సందర్శించి తైవాన్ స్వతంత్రత గురించి అమెరికా రాజకీయ నాయకులతో చర్చించటమే.