Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : గూగుల్ మరికొందరు ఉద్యోగులపై వేటు వేసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో మొత్తం ఉద్యోగుల్లో ఆరు శాతం అంటే 12,000 మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా మరికొందరిని తొలగించే అవకాశం ఉన్నట్లు గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ... కృత్రిమ మేథస్సు (ఎఐ), చాట్‌బాట్ బార్డ్, జీమెయిల్, గూగుల్ డాక్స్ వంటి ఇతర కీలక ప్రాజెక్టులు కొనసాగుతున్నట్లు పిచారు తెలిపారు. వాటిపై ఇంకా దృష్టి సారించాల్సి వుందని, వాటిలో ఉన్న అవకాశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే తమ సిబ్బందిని అధిక ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టుల్లోకి తరలిస్తున్నామని పేర్కొన్నారు. కంపెనీలో జరుగుతున్న ప్రతి పనిని క్షుణ్నంగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి జరిగినా మరిన్ని పనులు చేపట్టాల్సి వుందని అన్నారు. కంపెనీ సామర్థ్యాన్ని మరో 20 శాతం పెంచాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరిలోనూ భారత్‌లో వివిధ విభాగాలకు చెందిన సుమారు 450 మంది ఉద్యోగులను తొలగించినట్లు గూగుల్ ప్రకటించింది. అయితే ఈ 450 మంది 12,000 తొలగింపుల్లో భాగమా.. కాదా.. అనే విషయంపై మాత్రం గూగుల్ ఎలాంటి ప్రకటన చేయలేదు.