Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెల్లూరు నరసింహారావు
మాదక ద్రవ్యాల తయారీలో ఉపయోగించే గంజాయి సాగును తాలిబన్లు నిషేధించి దాదాపు ఒక సంవత్సరం అవుతోంది. దీని ప్రభావం ప్రపంచ మాదక ద్రవ్య మార్కెట్లపై తీవ్రంగా ఉండబోతోంది. దీనితో అనేక దేశాలకు మాదక ద్రవ్యాల నుంచి ఉపశమనాన్ని కాకుండా వాటి విని యోగానికి సంబంధించిన సంక్షోభం మరింతగా తీవ్రతరం అవనుంది. ప్రపంచ మార్కెట్లో అప్ఘాన్ గంజాయి ఆధారిత హెరాయిన్ అందుబాటులో లేకపోతే ఫెంటానిల్ అనే సింథటిక్ మాదక ద్రవ్య వినియోగం పెరుగుతుంది. పర్యవసానంగా అమెరికా, పశ్చిమ దేశాలతోపాటు అనేక దేశాలలో డ్రగ్ ఓవర్ డోస్ మరణాలు విపరీతంగా పెరుగు తాయి. ఫెంటానిల్ అమెరికా ఆరోగ్య వ్యవస్థలోని మెడికల్ ప్రిస్క్రిప్షన్ల ద్వారా చైనా, మెక్సికో దేశాల నుంచి దిగుమతి అవుతోంది.
అమెరికా అప్ఘానిస్తాన్‌పై ''టెర్రరిజంపై ప్రపంచ యుద్ధం'' అని ప్రకటించిన కాలం (2001) లో అమెరికా తదితర దేశాలలో హెరాయిన్ ఓవర్ డోస్ కేసులు బాగా పెరిగాయి. అప్ఘానిస్తాన్ ప్రభు త్వాలపైనా అమెరికాకు పూర్తి నియంత్రణ ఉన్నప్ప టికీ ఆ దేశంలో మాదక ద్రవ్య సంబంధిత ఉత్పత్తు ల సాగును గానీ, వాటి ఎగుమతులను గానీ నియంత్రించలేకపోయింది. నిజానికి అవి అమెరికా కనుసన్నల్లో పెరిగాయి.
అంతర్జాతీయ మాదక ద్రవ్య నియంత్రణ వ్యవహారాల సహాయ కార్యదర్శిగా వున్న రాబర్ట్ చార్లెస్ 2004 ఫిబ్రవరిలో అమెరికా కాంగ్రెస్‌కి ''మాదక ద్రవ్య టెర్రరిజం''ను ప్రతిఘటించటానికి ఉద్దేశింపబడిన నూతన విధానాన్ని వివరించాడు. పది సంవత్సరా లలో అమెరికా మద్దతుతో అప్ఘాన్ ప్రభుత్వం మాదక ద్రవ్య సాగును నిర్మూలిస్తుందని ఆయన చెప్పాడు. అమెరికా గూఢచార సంస్థ సిఐఏ మద్దతుతో మాదక ద్రవ్యాలకు బదులుగా ప్రత్యా మ్నాయ పంటలను ప్రోత్సహించాలని ఆదేశిం చారు. కానీ వాస్తవం మరోలా ఉంది. అఫ్ఘానిస్తాన్ లో 1991 నుంచి సిఐఏ ''మాదక ద్రవ్య వ్యాపారం లో మునిగి తేలుతోంది'' అని అమెరికా న్యాయ శాఖ తన విధానపత్రంలో ఆరోపించింది. సిఐఏ రహస్య కార్యకలాపాలతో మాదక ద్రవ్యాల స్వయం సమృద్ధి జోన్‌గా వున్న దక్షిణ ఆసియా ప్రపంచ మార్కెట్‌కు హెరాయిన్ ప్రధాన సరఫరాదారుగా మారింది. మాదక ద్రవ్యాలతో పాటుగా ఇస్లామిస్టు జిహాదీ టెర్రరిస్టు భావజాలాన్ని ప్రపంచ వ్యాప్తం చేసిన అదృశ్య శక్తి సిఐఏ నే.
మాదక ద్రవ్య సాగును, ఉత్పత్తిని నియంత్రిం చాలనే ఆసక్తి అమెరికాకు, దాని నాటో మిత్ర దేశాలకు లేదనేది సుస్పష్టం. ఈ దేశాలు తిరుగు బాటును అణచివేసే పేరుతో మాదక ద్రవ్య సాగు ను, ఉత్పత్తిని సంరక్షిస్తున్నాయి. నిజానికి 2001లో అమెరికా అప్ఘానిస్తాన్‌ను దురాక్రమించటానికి ముందే తాలిబన్లు మాదక ద్రవ్య సాగును అరికట్టా లని ప్రయత్నించారు. ఒకవైపు మాదక ద్రవ్యాల వ్యాపారంతో విదేశాల్లోని కీలుబొమ్మ ప్రభుత్వాలను అవినీతిలోకి దించుతూ మరోవైపు (నికరాగ్వా, హైతీల నుంచి ఆగేయాసియా, ఇండోచైనావంటి దేశాలదాకా) అటువంటి వ్యాపారంతో ఏమాత్రం సంబంధంలేని ప్రతిపక్ష పార్టీలు మాదక ద్రవ్య వ్యాపారం చేస్తున్నాయని ఆరోపించిన చరిత్ర సిఐఏ కుంది.
వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురో కొలంబియాలో ఫార్క్ పేరుతో సాయుధ పోరాటం చేసిన విప్లవకారులతో మిలాఖత్ అయి కొకైన్ అనే మాదక ద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తున్నాడని అమెరికా ఆరోపించింది. నిజానికి 2022లో వామపక్ష అభ్యర్థి అధ్యక్షుడిగా ఎన్నుకోబడేదాకా కొలంబియాలోని నియంతృత్వ ప్రభుత్వానికి ఎటువంటి షరతులు లేకుండా అమెరికా మద్దతు పలికింది. అటువంటి నియంతృత్వ ప్రభుత్వ కనుసన్నల్లో మాదక ద్రవ్యాల వ్యాపారం అనేక సంవత్సరాలు నిరాటంకంగా జరిగింది.
ఆ విధంగా చారిత్రకంగా మాదక ద్రవ్య వ్యాపారాన్ని నియంత్రించటంలోగానీ, వినియో గాన్ని తగ్గించటంలో గానీ అమెరికా నిజాయితీగా వ్యవహరించలేదనేది సుస్పష్టం. అంతిమంగా మాదక ద్రవ్యాల నియంత్రణపై అమెరికన్లు అనుసరించిన అవకాశవాద విధానం విఫలమైన తరువాత తాలిబన్లు తమ దేశంలో మాదక ద్రవ్యాలకు ముడి సరుకైన గంజాయి సాగును విజయవంతంగా నియంత్రించగలిగారు.