Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: బ్రిటన్ ఉప ప్రధాని, న్యాయ శాఖ మంత్రి డొమినిక్ రాబ్ పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. రాబ్ తన మంత్రిత్వశాఖలోని సిబ్బంది పట్ల అనుచితంగా వ్యవహరించినట్లు నిర్ధారణ కావడంతో ఆయన నిష్క్రమణ అనివార్యమైంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సునాక్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ పార్టీపై ప్రతికూల ప్రభావం చూపనుంది. సీనియర్ న్యాయవాది టోలి నేతృత్వంలోని విచారణ కమిటీ ఆయనను దోషిగా నిర్దారించడంతో రాబ్ తన రాజీనామాను ట్విట్టర్లో వెల్లడించారు. సహౌద్యోగులపై అనుచిత ప్రవర్తనకు సంబంధించి వచ్చిన ఆరోపణల్లో న్యాయశాఖ మంత్రి దోషా, నిర్దోషా వెంటనే తేల్చాలని, లేకుంటే తాము ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వస్తుందని ఆ శాఖ సీనియర్ అధికారులు స్పష్టంగా తేల్చి చెప్పారు. మొన్నటివరకు రాబ్పై తనకు పూర్తి విశ్వాసం ఉందన్న ప్రధాని రిషి సునాక్ టోలి కమిటీ నివేదిక చేతికి వచ్చాక క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానని చెప్పారు. ఆ తరువాత కొన్ని గంటల్లోనే రాబ్ రాజీనామా వార్త వెలువడింది. . ఆయన తన రాజీనామా లేఖను ప్రధాని రిషి సునాక్కు ట్విటర్లో పోస్ట్ చేశారు. సునాక్ మంత్రివర్గం నుంచి రాజీనామా చేసిన మంత్రుల్లో రాబ్ మూడవ వాడు. టోలీ కమిటీ నివేదికను బయటపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.